ముంబై: ఐపీఎల్‌లో భాగంగా నిన్న (ఆదివారం) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ పృథ్వీ షాకు జరిమానా పడింది.
ఫలితంగా అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. లెవల్-1 నేరానికి పాల్పడడంతో షాపై ఈ చర్యలు తీసుకున్నారు.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 కింద లెవల్ 1 నేరానికి పాల్పడినట్టు షా అంగీకరించాడని, మ్యాచ్ రిఫరీ తుది నిర్ణయం మేరకు జరిమానా విధించినట్టు అని ఐపీఎల్ తెలిపింది.
అయితే, పృథ్వీ షా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఎక్కడ ఉల్లంఘించాడన్న విషయంపై ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టంగా పేర్కొనలేదు.
ఈ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి షా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ చివరి వరకు పోరాడి 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ నాలుగింటిలో మాత్రమే విజయం సాధించి 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.