హైదరాబాద్: అందం, అభినయం కలగలిసిన నటి సాయిపల్లవి. ప్రస్తుత హీరోయిన్లు అందరూ గ్లామర్‌ను మాత్రమే నమ్ముకుని సినిమాలు చేస్తుంటే సాయిపల్లవి మాత్రం టాలెంట్‌ను మాత్రమే నమ్ముకుంది. అదే ఆమెకు వరుస సినిమాలు తెచ్చిపెడుతున్నాయి.
అంతేకాదు, ఆమెకు బోల్డంతమంది అభిమానులు ఉండడానికి కూడా ఆమె నటనే కారణం. కుటుంబంలోని అందరూ అభిమానించే నటిగా సాయిపల్లవి గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవల నానితో కలిసి ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కలిసి నటించిన ఆమె గురించి ఓ వార్త టాలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోందని, పెళ్లి ఏర్పాట్లలో ఆమె కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారని టాలీవుడ్ కోడై కూస్తోంది.
గత కొంతకాలంగా ఆమె ఏ సినిమాకూ సైన్ చేయకపోవడం చూస్తుంటే ఈ వార్తలు నిజమే అనిపిస్తుంది. అంతేకాదు, ఇటీవల ఆమె ఎక్కడా బయట కనిపించకపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
తన గురించి చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై సాయి పల్లవి ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ, ఆమె సన్నిహితులు మాత్రం స్పందించారు. సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతోందనే వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని కొట్టిపడేశారు.
మంచి క్యారెక్టర్ల కోసం ఆమె ఎదురు చూస్తోందని, దొరికితే ఆమె కొత్త సినిమాలో నటిస్తుందని చెప్పుకొచ్చారు. కాగా, రానా దగ్గుబాటితో కలిసి సాయిపల్లివి నటించిన ‘విరాటపర్వం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.