5న తిరుపతికి సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- Advertisement -

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 5న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు.

అలిపిరి వద్ద 240 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం టాటా కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు.

పర్యటనలో భాగంగా తిరుపతిలో నిర్వహించే జగనన్న విద్యాకానుక బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు.

కాగా, గతేడాది భారీ వర్షాల కారణంగా తిరుమల పైకి వెళ్లే నడకమార్గం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పునర్నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు.

ఈ నేపథ్యంలో ఆ మార్గాన్ని కూడా జగన్ ప్రారంభిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

చదవండి: Delhi Capitals: క్రికెటర్ పృథ్వీషాకు భారీ జరిమానా… ఎందుకో తెలుసా?
- Advertisement -