ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్

- Advertisement -

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం సాయంత్రం విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రేడ్లు ఇచ్చేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఛాయారతన్ కమిటీ అన్ని విషయాలు పరిశీలించి అవసరమైన సిఫార్సులు చేసిందన్నారు.

అయితే పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అభిప్రాయపడ్డారు.

www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా 2021 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఫలితాలు తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు.

 

- Advertisement -