28.2 C
Hyderabad
Monday, November 2, 2026
- Advertisement -
Home Uncategorized ఫ్రెండ్ పెళ్లిలో మృణాళ్ ఠాకూర్ మాస్ రచ్చ.. స్టెప్పులతో రచ్చ రంబోలా!

ఫ్రెండ్ పెళ్లిలో మృణాళ్ ఠాకూర్ మాస్ రచ్చ.. స్టెప్పులతో రచ్చ రంబోలా!

- Advertisement -

‘సీతా రామం’ ఫేమ్ మృణాళ్ ఠాకూర్ తన నటనతోనే కాదు, డాన్స్‌తోనూ అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆమె స్నేహితురాలు విదుషి పరాశర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పాత పెళ్లి డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట మళ్లీ వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో మృణాళ్ తన స్నేహితులతో కలిసి ఫుల్‌ ఎనర్జీతో, ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ కనిపించింది. పెళ్లి వేడుకల్లో పూర్తి దేశీ లుక్‌లో కలర్‌ఫుల్ దుస్తులు ధరించి ఆమె వేసిన కిరాక్ స్టెప్పులు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ స్పెషల్ జ్ఞాపకాన్ని విదుషి షేర్ చేయడంతో, క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయింది. “మృణాళ్ స్పెషల్ మూమెంట్స్ ఎప్పుడూ స్పెషలే”, “సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ మృణాళ్ ఎంతో క్యూట్” అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -