జగన్ సంచలన నిర్ణయం.. చంద్రబాబుకి మేలు చేయనుందా?

10:11 am, Tue, 14 May 19
YS Jagan Updates, Chandrababu Naidu Varthalu, AP Latest Political Updates, Newsxpressonline

అమరావతి: ఎక్కడైనా సరే ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు అధికార,ప్రతిపక్ష పార్టీల్లో ఫిరాయింపులు సర్వసాధారణం. కొంతమంది నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ కొడతారు.

2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే జరిగింది. వైసీపీ నుంచి 20కు పైగా ఎమ్మెల్యేలు పసుపు కండువా కప్పేసుకున్నారు. అయితే తాజాగా ఎన్నికలు ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదే సీన్ ఎక్కడ తన విషయంలో రిపీట్ అవుతాదామోనన్న భయంతో ఉన్నారు చంద్రబాబు.

అయితే జగన్ మాత్రం పార్టీ ఫిరాయింపులపై మొదట నుంచి చెబుతున్న మాట మీద నిలబడినట్లు సమాచారం. ఒకవేళ అన్ని అనుకూలించి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే, పార్టీ ఫిరాయింపు నేతలపై ఆయన కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎవరైనా సరే వేరే పార్టీలో గెలిచి తన పార్టీలో రావాలంటే మాత్రం కొన్ని నిబంధనలు ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.

చదవండి: ఏ1, ఏ2 లకి అందరూ అలానే కనబడతారు! టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు…

పార్టీతో పాటు పదవులకు రాజీనామాలు చేసిన తర్వాత వైసీపీ కండువా కప్పుకోవాలని కండిషన్స్ పెడుతున్నారు. దీంతో ఫిరాయింపులకు సిద్ధమవుతున్న నేతలంతా షాక్ అవుతున్నారు. ఇంత ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి మళ్లీ పదవులకు రాజీనామాలు ఎలా చేయాలంటూ మీమాంసలో పడిపోతున్నారు.

జగన్ గతంలో కూడా తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకున్నపుడు వారిని పదవులకు రాజీనామా చేయామని డిమాండ్ చేశారు.
 
ఇపుడు కూడా వైసీపీలో చేరడానికి అనేకమంది టీడీపీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే జగన్ మాత్రం వారికి కండిషన్లు పెడుతున్నారు. ఎవరైనా తమ పార్టీలోకి చేరాలంటే మాత్రం వారు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రావాలని చెబుతున్నారు. దీంతో పాటు పదవులను కూడా వదులుకోవాలంటున్నారు. దీంతో టీడీపీ నేతలంతా ఆలోచనల్లో పడిపోతున్నారు.
 
అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో చంద్రబాబు మాత్రం ఫుల్ హ్యాపీలో ఉన్నారట. ఎందుకంటే జగన్ అధికారంలోకి వస్తే తమ ఎమ్మెల్యేలను గుంజుకుపోతారన్న భయం ఇక బాబుకు ఉండదు. జగన్ అలా చేయడని వైసీపీ నేతలు భరోసా ఇస్తున్నారు. దీంతో తమ పార్టీ నేతలు ఎటుపోరన్న ధీమాతో చంద్రబాబు హ్యాపీగా ఉన్నారు.
చదవండి:  మళ్ళీ ఆ సీటు వైసీపీ ఖాతాలోకే….!