ఉద్యోగం కోసం సౌదీ వెళ్ళి నరకం చూస్తున్న యువతి….

- Advertisement -

హైదరాబాద్: ఉద్యోగం కోసమని గల్ఫ్ దేశాలకి వెళ్ళి అనేకమంది భారతీయులు నానా రకాల ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇక వీరిలో చాలామంది తెలంగాణ నుంచి వెళ్ళిన వారే ఎక్కువ. అక్కడకి వెళ్ళాక వారు పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు…ఉద్యోగం పేరుతో గొడ్డు చాకిరీ చేయించుకుని, వేళకి తిండి పెట్టక హింసకి గురి చేస్తుంటారు.

చదవండి: సౌదీలో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష! ఎంబసీకి కూడా సమాచారం ఇవ్వని అధికారులు!?

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కి చెందిన ఓ యువతిని …కొందరు ఉద్యోగం పేరుతో రియాద్ తీసుకెళ్లి నరకం చూపిస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే…గౌషియా బేగమ్ అనే యువతికి… రియాద్‌లో మంచి ఉద్యోగం ఇస్తామంటూ కొందరు వ్యక్తులు ఆమెని సంప్రదించారు.

అసలు రోజుకి నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుందని, మంచి జీతం వస్తుందని నమ్మించి… రియాద్‌కి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత నుంచే ఆమె కష్టాలు మొదలయ్యాయి. అసలు చదువు తగ్గ ఉద్యోగం ఇవ్వకుండా…ఆమెతో గొడ్డు చాకిరీ చేయించడం మొదలుపెట్టారు.

యజమానులు కనీసం తిండి కూడా పెట్టకుండా హింసించడం, తిరిగి స్వదేశానికి వెళ్లడానికి కూడా అనుమతించలేదు. ఇక విషయం తెలుసుకున్న యువతి సోదరి రెహ్మత్ బేగమ్ మీడియా ద్వారా తన సోదరి పడుతున్న కష్టాలని వివరించింది.

అలాగే తన సోదరిని ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలంటూ… రెహ్మత్ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ని కోరుతున్నారు. మంత్రి కూడా కావలసిన సహాయ సహకారాలని అందిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది..

చదవండి: జూలై 4 నుంచి ‘తానా’ మహాసభలు.. ట్రంప్, చంద్రబాబు, కేసీఆర్‌కు ఆహ్వానం!
- Advertisement -