వామ్మో.. మాస్క్ ధరించకుంటే రూ.61 వేలు.. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా!

- Advertisement -

దుబాయ్‌: కరోనా మహమ్మారి మరింత వ్యాపించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలను గాలికొదిలేస్తున్నారు. 

ప్రభుత్వం ఎంతగా మొత్తుకుంటున్నా ప్రజల వైఖరిలో మార్పు కనిపించకపోవడంతో యూఏఈ మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. 

చదవండి: వీడెవడండీ బాబు!: విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లి.. 24 ఏళ్లుగా అక్కడే మకాం, చివరికి…

ఇందులో భాగంగా మాస్క్‌లు ధరించకుండా రోడ్డుపైకి వచ్చే వారికి రూ. 61,772 జరిమా విధించాలని నిర్ణయించింది.

క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించేవారికి రూ.10,29,539 చొప్పున జరిమానా విధించాలని దుబాయ్‌ ప్రభుత్వం చట్టం చేసింది.

అదే పనిగా నిబంధనలు ఉల్లంఘించేవారికి రూ.20 లక్షల జరిమానా విధించనున్నారు.

రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ఈ వారం నుంచి రాత్రి పూట రెండు గంటల పాటు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు  ప్రభుత్వం తెలిపింది.

దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఇకపై రాత్రి 10 గంటలకు బదులుగా 8  గంటలకే మొదలై ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది.

ఇప్పటికే  విమానాల రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం.. రంజాన్‌ పర్వదినం సందర్భంగా కొనుగోళ్లు జరుపుకొనేందుకు వీలుగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాల్స్‌ తెరిచేందుకు అనుమతిచ్చింది.

చదవండి: షాకింగ్: అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఊస్ట్! 90 ఏళ్ల తర్వాత మళ్లీ…

తక్కువ  మందిని అనుమతినిస్తూ రెస్టారెంట్లు, కెఫేలు నడుపుకొనేందుకు కూడా అనుమతించింది. సోమవారం వరకు అరబ్‌ ఎమిరేట్స్‌లో 832 కేసులు నమోదు కాగా, నలుగురు మరణించారు.

తాజా కేసులు మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా 24,190 కేసులు నమోదు కాగా, 224 మంది కరోనా కాటుకు బలయ్యారు. 

- Advertisement -