సౌదీలో కడపవాసి మృతి.. విధులకు వెళ్తుండగా గుండెపోటుతో…

- Advertisement -

కడప: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా సత్తార్‌కాలనీ (కాగితాలపెంట)కు చెందిన పఠాన్ అంజాద్‌ఖాన్ సౌదీ అరేబియాలో మృతి చెందాడు. జీవనోపాధి కోసం సౌదీ వెళ్లిన అంజాద్‌ఖాన్ జుబైల్‌లో భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.

శనివారం విధులకు వెళ్లేందుకు బయలుదేరుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. చికిత్స కోసం తరలించేలోగానే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న కడపలోని ఆ తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

పఠాన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. 

- Advertisement -