అమెరికాలో మరో ఉన్మాది ఘాతుకం: బలైపోయిన పోలీసు అధికారి

- Advertisement -

shooter-florence

దక్షిణ కరోలినా: అమెరికాలోని దక్షిణ కరోలినా కాల్పుల మోతతో మారుమోగిపోయింది. ఓ అగంతకుడు పోలీసులనే లక్ష్యంగా చేసుకుని తన ఇష్టానుసారం కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు, వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా… ఒక పోలీస్ ఆఫీసర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ సంఘటన ప్లోరెన్స్ కౌంటీ పరిధిలోని మిర్టల్ తీరంలో జరిగింది. ఈ సంఘటనతో  స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఓ ఇంట్లోకి ప్రవేశించిన అగంతకుడు కొద్దిమంది చిన్నారులను బందీలుగా చేసుకున్నాడు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అధికారులను గమనించిన ఆ అగంతకుడు ఇష్టానుసారంగా పోలీస్ అధికారులుపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఐదుగురు పోలీస్ అధికారులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చివరికి రెండు గంటలపాటు ఈ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు అగంతకుడిని అదుపులోకి తీసుకోగలిగారు. అయితే ఈ దాడికి గల కారణం ఇంకా తెలియరాలేదు.

మరోవైపు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాళులు అర్పించారు. పోలీస్ అధికారులకు అమెరికా ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు.

- Advertisement -