షాకింగ్: హెచ్-1బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం.. ఇక ‘మెరిట్ బేస్డ్’ విధానం, అదీ రేపట్నించే…

US moving to merit based system as Trump suspended the Lottery system of H1B Visa
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అనుసరిస్తోన్న లాటరీ విధానానికి స్వస్తి పలుకుతూ.. హెచ్-1బీ వీసాల జారీని ఈ ఏడాది ఆఖరు వరకు రద్దు చేశారు. 

ఇక మీదట కేవలం ‘ప్రతిభ ఆదారంగా’ మాత్రమే హెచ్-1బీ వీసాలు జారీ చేస్తామని ప్రకటించారు. అధ్యక్షుడి ప్రకటనతో శ్వేతసౌధం అధికారులు కూడా వీసాల జారీలో నూతన విధానం దిశగా అడుగులు వేస్తున్నారు. 

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. అమెరికా పౌరులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యాలు కలిగిన వారికి మాత్రమే తమ దేశంలో ఉద్యోగావకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

అమెరికా ఉద్యోగాలను.. చౌకగా లభించే ఇతర దేశాల ఉద్యోగులతో భర్తీ చేసే వీలు కలిగిస్తోన్న ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానాలలో లోపాలను సవరిస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. 

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 24.. అంటే రేపటి నుంచే అమెరికాలో అమలులోకి రానుంది. ఇప్పటి వరకు హెచ్-1బీ వీసాలు లాటరీ విధానం ద్వారా జారీ అయ్యేవి. 

ఇక నూతన విధానంలో…

ఇక మీదట హెచ్-1బీ వీసా గరిష్ట వేతన స్థాయి ఆధారంగా జారీ కానున్నట్లు అధికారులు తెలిపారు. అంటే.. అత్యధిక వేతనాలు లభించే ఉద్యోగులకు మాత్రమే హెచ్-1బీ వీసా జారీలో ప్రాధాన్యం లభిస్తుంది.

ఈ నూతన విధానం కారణంగా అమెరికాలో ఉద్యోగాలకు విదేశీయుల పోటీ తగ్గుతుంది. అయితే ఈ నూతన వీసా జారీ విధానం నిర్ణయం వల్ల భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

భారతీయులు వీసా స్టాంపింగ్ కోసం సంవత్సరం చివరి వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇప్పటికే వివిధ భారతీయ, అమెరికన్ కంపెనీలలో విధులు నిర్వహిస్తున్న భారతీయులకు వీసాల పునరుద్ధరణలో జాప్యం తప్పదు. 

 

- Advertisement -