వీడెవడండీ బాబు!: విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లి.. 24 ఏళ్లుగా అక్కడే మకాం, చివరికి…

mumbai-man-who-flew-to-us-24-years-ago-on-visitor-visa-deported
- Advertisement -

న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా.. ముఖ్యంగా అమెరికాలో భారతీయులకు ఎంతటి పేరుందో అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది భారతీయుల వల్ల మాత్రం అక్కడ భారతీయులకు అపఖ్యాతి కలుగుతోంది.

ఈ సంఘటన గురించి చదివాక అలాగే అనిపిస్తోంది మరి. ముంబైకి చెందిన ఓ వ్యక్తి 24 ఏళ్ల క్రితం విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లి మళ్లీ తిరిగి రానేలేదు.  అక్కడి ఓ ఐలాండ్‌లో అక్రమంగా నివసిస్తున్నాడు. 

చదవండి: షాకింగ్: అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఊస్ట్! 90 ఏళ్ల తర్వాత మళ్లీ…

అమెరికాలో ఇలాంటి భారతీయులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. అందుకే అక్కడి ప్రభుత్వం మొత్తం 161 మంది భారతీయులను ఓ ప్రత్యేక విమానంలో తిరిగి ఇండియాకు పంపించేస్తోంది. 

వీరంతా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకోనున్నారు. ఈ 161 మందిలో సూసయ్ మాణికమ్ ఫ్రాన్సిస్(57) కథ వింటే ఆశ్చర్యం కలగకమానదు.

ముంబాయికి చెందిన ఫ్రాన్సిస్ 1996లో బీ-2 విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లాడు. ఈ వీసాపై వెళ్లిన వారు అమెరికాలో ఆరు నెలలు ఉండటానికి మాత్రమే అనుమతి ఉంటుంది.

ఆర్నెల్లు గడిచాయి కానీ.. ఫ్రాన్సిస్ మాత్రం తిరిగి ఇండియాకి రాలేదు. ఇన్నాళ్లూ దొంగచాటుగా న్యూయార్క్‌లోని లాంగ్ ఐల్యాండ్‌లోనే నివాసముంటూ వచ్చాడు.

అమెరికాలో నివసించేందుకు చట్టపరంగా ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికి దర్జాగా 25 ఏళ్ల పాటు అమెరికాలో జీవించేశాడు.

అయితే 19 ఏళ్ల తరువాత అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకు ఫ్రాన్సిన్‌ను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదుపులోకి తీసుకుంది.

చదవండి: వందే భారత్ మిషన్-2: చికాగో నుంచి ఏపీకి చేరుకున్న 31 మంది ఎన్నారైలు…

2015 మార్చి 25వ తేదీన ఇమ్మిగ్రేషన్ కోర్టుకు హాజరుకావాలంటూ ఫ్రాన్సిస్‌కు నోటీసులు అందాయి. తన అరెస్ట్‌కు సంబంధించి ఫ్రాన్సిస్ కోర్టును సంప్రదించినా ఫలితం లేకపోయింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఫ్రాన్సిస్‌కు ఇద్దరు పిల్లలుండగా.. వారిలో ఒకరు అమెరికాలోనే జన్మించారు. అంటే అక్కడి పౌరసత్వం కలిగి ఉన్నారన్నమాట. 

- Advertisement -