షాకింగ్: అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఊస్ట్! 90 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే…

- Advertisement -

వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలం అవుతున్న అమెరికాలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల అవస్థలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. 

అక్కడ కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. తాజాగా విడుదలైన ఉద్యోగ గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నట్టు తేలింది.

90 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు…

1930లో ఏర్పడిన మహామాంద్యం తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 1931-40 మధ్య నిరుద్యోగిత రేటు కనిష్ఠంగా 14 శాతానికి పైగా ఉండగా, గరిష్ఠంగా 25 శాతంగా నమోదైంది.

2008-09లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం సమయంలో ఇది 10 శాతం ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభం కారణంగా వచ్చే ఏడాదికి నిరుద్యోగం రేటు 10 శాతానికి పైగా నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఉద్యోగాలు కోల్పోయిన 2.6 కోట్ల మంది ఇప్పటికే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకోగా, గత వారంలో మరో 44 లక్షల మంది దరఖాస్తు చేస్తుకున్నట్టు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది.

చదవండి: ‘అమ్మో’రికా: ఒక్కరోజులో దాదాపు 30 వేల పాజిటివ్ కేసులు! అమెరికాలో అసలేం జరుగుతోంది?
చదవండి: కరోనా ఎఫెక్ట్: ట్రంప్ తాజా నిర్ణయం.. భారతీయులపై తీవ్ర ప్రభావం, అదే గనుక జరిగితే… 
- Advertisement -