
హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో సెలబ్రిటీలు పలువురు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎవరి స్టయిల్లో వారు బిజీగా మారిపోయారు.
టాలీవుడ్ హీరోలు, దర్శకులు ‘బీ ద రియల్ మ్యాన్’ పేరిట పరస్పరం ఛాలెంజ్ చేసుకుంటూ ఇంటి పట్టునే ఉండి ఎవరేం చేస్తున్నారో వీడియోల సహా పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఇంట్లో ఉండమంటే.. మాయమైంది! ఇంతకీ గాయని కనికా కపూర్ ఎక్కడున్నట్లు?
ఇక బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇంట్లోనే ఉంటూ రోజులను తామెలా గడిపేస్తున్నారో తమ అభిమానులకు వివరించడమేకాక ‘స్టే హోమ్.. స్టే సేఫ్’ అంటూ మెసేజ్‌లు ఇస్తున్నారు.
ఇంట్లో తాము చేసే డ్యాన్సులు, జిమ్, యోగా, వంటింట్లో దూరి స్వయంపాకంలో తమ ప్రావీణ్యం ఏపాటిదో కూడా అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.
తమ్ముడ్ని గుర్తు చేసుకుంటూ…
ఈ నేపథ్యంలో సౌతిండియాలో గ్లామర్ హీరోయిన్‌గా, ‘బాహుబలి’ సిరీస్‌తో జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా.. లాక్‌డౌన్ వేళ అమెరికాలో ఉన్న తన తమ్ముడు ఆనంద్ భాటియాను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది.
చిన్నతనంలో తన తమ్ముడితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. ‘లాక్‌డౌన్ పీరియడ్‌లో నువ్వు కూడా ఇండియాలో ఉండి ఉంటే ఎంతో బాగుండేది..’ అంటూ తమ్ముడ్ని ఉద్దేశించి పోస్టు పెట్టింది.
చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సెకండ్ మూవీ.. హీరోయిన్లుగా శృతి హాసన్, నివేత పేతురాజ్!?
ఈ సందర్భంగా తమన్నా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ఫొటోలో తమన్నా ఇంట్లో కింద కూర్చుని ఉండగా, ఆమె తమ్ముడు వెనుకే సోఫాలో కూర్చుని.. తమన్నా జుట్టును తనకు మీసంగా పెట్టుకుని సరదాగా అక్కను ఆట పట్టిస్తున్నాడు.
మరో పోస్టులో.. తమన్నా తన చిన్ననాటి ఫొటోల ఆల్బంను షేర్ చేస్తూ.. ‘‘ఈ రోజు ఇంటిని శుభ్రం చేస్తుంటే నాకు నా చిన్ననాటి ఫొటోల ఆల్బమ్ దొరికింది. తరువాత వాటిని చూస్తూ రోజంతా గడిపేశా..’’ అంటూ పోస్టులో పేర్కొంది.
ప్రస్తుతం తమన్నా బాలీవుడ్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘బోలే చుడియా’ సినిమాలో నటిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ఇతర సెలబ్రిటీల మాదిరిగానే తాను కూడా కుక్ అవతారమెత్తి కప్ కేక్స్‌ను తయారు చేసి ఆ విడియోను తన అభిమానులతో షేర్ చేసుకుంది.
ఇంకా, తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను కూడా అభిమానులతో పంచుకుంటూ తన వర్కవుట్స్ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేసింది.








