అదే ‘శివమణి’ ఇప్పుడు గనుక తీస్తే.. డైలాగ్స్ ఇలాగే: మిమిక్రీ వీడియో షేర్ చేసిన నాగార్జున…

hero-nagarjuna-still-from-shivamani-movie
- Advertisement -

హైదరాబాద్: ‘నా పేరు శివమణి.. నాకు కొంచం మెంటల్‌.. ఇప్పటివరకు మాస్కులు లేకుండా ఎందుకు తిరిగారో నేను అడగ.. సడన్‌గా కరోనా వచ్చింది మాస్కులు వేసుకోండి అంటే కష్టంగానే ఉంటది..’

అర్రె.. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? నిజమే, ఈ డైలాగ్ హీరో నాగార్జున-దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘శివమణి’ చిత్రంలోది. 

చదవండి: ‘కరోనా’కాలం: అమెరికాలో ఉన్న తమ్ముడ్ని గుర్తుచేసుకుంటూ.. తమన్నా తీవ్ర భావోద్వేగం

అంటే.. డైలాగ్ మొత్తం ఆ సినిమాలోది కాదుకానీ, స్టయిల్ మాత్రం అదే. కాకపోతే ఇప్పుడు కరోనా కాలం కదండీ. ఈ సమయంలో గనుక ఆ సినిమా రిలీజ్ అయితే నాగార్జున చెప్పే డైలాగ్స్ ఇలాగే ఉండొచ్చు.

తన గొంతును అనుకరిస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్ భవిరి రవి చెప్పిన శివమణి సినిమా డైలాగ్స్ మాడ్యులేషన్ నాగార్జునకు కూడా నచ్చినట్లుంది. ఆయన ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది. 

శివమణి సినిమాలో వైజాగ్ పూర్ణా మార్కెట్‌లో నాగార్జున చెప్పిన ఆ డైలాగులు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించిన నాగార్జున ఆ మార్కెట్‌లో రౌడీలపై పంచ్‌ డైలాగులు విసురుతాడు.

చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సెకండ్ మూవీ.. హీరోయిన్లుగా శృతి హాసన్, నివేత పేతురాజ్!?

ఆ డైలాగులనే మార్చి నాగార్జున వాయిస్‌లో కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన‌ జాగ్రత్తలను మిమిక్రీ ఆర్టిస్ట్ రవి చెప్పాడు. మళ్లీ ఓసారి ఆ డైలాగ్స్ వినండి.. సరదాగా!

 

- Advertisement -