భారత్-వెస్టిండీస్ తొలి టెస్ట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, అందరి కళ్లూ పృథ్వీషాపైనే…

- Advertisement -

rojkot-ind-westరాజ్‌కోట్: వెస్టిండీస్‌తో గురువారం నుంచి జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి  బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  ఈ మ్యాచ్ లో భారత జట్టు సెలెక్టర్లు పలువురు సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. దీంతో ప‌ృథ్వీషా అనే యువ క్రికెటర్ ఈ మ్యాచ్‌తో తొలిసారిగా టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు.

అంతేకాదు, ఈ యువ క్రికెటర్ ఓపెనర్ గా కూడా బరిలోకి దిగుతున్నాడు.  దీంతో అతడు ఎలా ఆడతాడన్న విషయమై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి, ఉత్కంఠ నెలకొని ఉన్నాయి. గత ఐపీఎల్ సీజన్‌లో దేశవాళీ పోటీల్లో రాణించిన పృథ్వీషా, కేఎల్ రాహుల్‌తో కలిసి భారత బ్యాటింగ్‌ను ప్రారంభించాడు. జేసన్ హోల్డర్ అందుబాటులో లేకపోవడంతో వెస్టిండీస్‌ కెప్టెన్సీ బాధ్యతలు తొలిసారి బ్రాత్ వైట్ స్వీకరించాడు.

ఇరు జట్ల వివరాలు ఇలా…

ఇండియా: కేఎల్ రాహుల్, పృధ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, కుల్ దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్.

వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్ వైట్ (కెప్టెన్), కిరన్ పావెల్, షాయి హోప్, సునీల్ అంబ్రిస్, షిమ్రాన్ హెట్ మేయర్, రోస్టన్ ఛేజ్, షేన్ డవ్రిక్ (వికెట్ కీపర్), దేవేంద్ర బిషో, షనాన్ గాబ్రియేల్, లూయిస్.

- Advertisement -