26.2 C
Hyderabad
Tuesday, November 3, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ MLC Kavitha: విమానంలో.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కవిత..

MLC Kavitha: విమానంలో.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కవిత..

- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో మంగళవారం తీహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha ) బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు.

మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో బయలుదేరి..  సాయంత్రం 4:45 గంటల ప్రాంతంలో ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.

చదవండి: MLC Kavitha: తీహార్ జైలు నుంచి కవిత విడుదల.. కుటుంబ సభ్యులను చూసి తీవ్ర భావోద్వేగం

శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా తన నివాసానికి చేరుకుంటారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా, సీబీఐ మరో కేసులో ఏప్రిల్ 15న అరెస్టు చేసింది.

అప్పట్నించి తీహార్ జైలులోనే ఉన్న కవిత మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. మరోవైపు సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు జరిగే విచారణకు కవిత వర్చువల్‌గా హాజరుకానున్నారు.

మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత మరికాసేపట్లో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగబోతున్నారు.

దాదాపు అయిదు నెలల తరువాత తమ అభిమాన నాయకురాలు తెలంగాణలో కాలుమోపుతున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు ఘనస్వాగతం పలికే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి.

- Advertisement -