- Advertisement -
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ పదవికి తాను రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలపై ఆ పార్టీ మాజీ ఎంపీ, సినీ నటి రమ్య స్పందించారు. అవన్నీ పుకార్లేనంటూ ఆమె కొట్టిపారేశారు. తాను ప్రస్తుతం సెలవులో ఉన్నానని… గురువారం నాటికి కార్యాలయానికి వస్తానని తెలిపారు.
రాఫెల్ ఒప్పందం నేపథ్యంలో… మోడీ ఒక దొంగ అంటూ ఆమె ట్వీట్ చేయడమేకాక ఓ ఫొటోను కూడా దానికి జతచేశారు. దీంతో.. లక్నోకి చెందిన సయ్యద్ రిజ్వాన్ అనే అడ్వకేట్ రమ్యపై ఫిర్యాదు చేశారు. ఆమె ట్వీట్ దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని, దేశ ధిక్కారం కిందకు కూడా వస్తుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, రమ్యపై దేశద్రోహం కేసు నమోదైంది.
- Advertisement -