మహాకూటమికి పేరు పెట్టేశారు.. ఇకనుంచి ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’గా…

- Advertisement -

Mahakutami

హైదరాబాద్: మహా కూటమి నేతలు బుధవారం గోల్కొండ హోటల్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశం లో కామన్ మినిమన్ ప్రోగ్రామ్‌(సీఎంపీ)కు కూటమి నేతలు తుది రూపం ఇవ్వనున్నారు. అంతేకాదు, మహాకూటమికి కూడా ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’గా నామకరణం చేశారు. ఈ తెలంగాణ పరిరక్షణ వేదికకు చైర్మన్‌గా కోదండరామ్‌ను ఎన్నుకున్నారు.

ఈ సమవేశం అనంతరం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోపై పలు దఫాలుగా కసరత్తు చేశారు. ఉద్యమ ఆకాంక్షలకు, అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విద్య, వైద్య, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి అంశాలకు సీఎంపీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుండి మల్లు భట్టి విక్రమార్క, టీడీపీ నుండి రావుల చంద్రశేఖర్ రెడ్డి, వామపక్ష నేత కూనమనేని సాంబశివరావు, టీజేఎస్ నుండి దీలీప్ హాజరయ్యారు. అయితే గాంధీ భవన్ నుండి ఫోన్ రావడంతో సమావేశం మధ్యలోనే భట్టి విక్రమార్క వెళ్ళిపోయారు. గడిచిన వారం రోజుల్లో 4 పార్టీల నేతలు 3 సార్లు సమావేశం అయ్యారు.

- Advertisement -