రైతుల దెబ్బకి దిగోచ్చిన పెప్సీ కో…కేసులు ఉపసంహరణ…

pepsico-withdraws-lawsuits-against-potato-farmers
- Advertisement -

ఢిల్లీ: రైతుల దెబ్బకి పెప్సీకో సంస్థ దిగోచ్చింది. దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనతో…గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంది. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది.

అసలు ఏం జరిగిందంటే?

అమెరికా కంపెనీ పెప్సీకో ఇండియా లేస్ చిప్స్ తయారీకి ఉపయోగించే బంగాళాదుంపలపై పేటెంట్ తీసుకుంది. దాని ప్రకారం రైతులు తమ అనుమతి లేకుండా ఆ రకం బంగాళాదుంపలు సాగు చేయకూడదని కంపెనీ చెబుతోంది. కానీ కంపెనీ అనుమతి లేకుండా ఆ రకం బంగాళాదుంపలను గుజరాత్‌లోని నలుగురు రైతులు పండించారని ఆరోపిస్తూ వారిపై కేసులు పెట్టారు.

అయితే పెప్సీకో రైతులపై కేసులు పెట్టడం గురించి వ్యవసాయ సంఘాలు, సామాజిక కార్యకర్తల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. రైతులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ వ్యవసాయ సంఘాలు… కేసులని వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేశాయి.

ఇక దీనిపై 200కి పైగా రైతు సంఘాల కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. కేసు వాపసు తీసుకోవాలని పెప్సీకోకు చెప్పాలని ప్రభుత్వాలను కోరారు. దీంతో రైతుల ఆందోళనలకి దిగోచ్చిన పెప్సీకో రైతులపై పెట్టిన కేసులని వెనక్కి తీసుకుంది.

చదవండి:విషాదం: సరదాగా డ్యామ్ కి వెళ్లి.. నీట మునిగి.. ముగ్గురు విద్యార్ధులు మృతి

- Advertisement -