23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఎన్నికల్లో కోట్లు ఖర్చు వ్యాఖ్యలు: జేసీకి షాక్ ఇచ్చిన ఈసీ

ఎన్నికల్లో కోట్లు ఖర్చు వ్యాఖ్యలు: జేసీకి షాక్ ఇచ్చిన ఈసీ

ec take a action against jc diwakar
- Advertisement -

అమరావతి: ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్లకు తగ్గకుండా… రూ.50 కోట్ల వరకు ఖర్చుపెట్టారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. అలాగే తమ వారసులు జేసీ అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌కుమార్‌రెడ్డిల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

మొత్తం మీద 175 నియోజకవర్గాలకు రూ.8,750 కోట్లు అవుతుందని,  గెలుపు కోసం ఒకాయన రూ.2 వేలు ఇస్తుంటే ఇంకొకాయన రూ.2,500 ఇస్తున్నాడని అన్నారు కొంత మంది ఎవరెవరు డబ్బులిస్తారా అని ఎన్నికల కోసమే కాచుకుని కూర్చుంటున్నారని, రూ.2 వేలు ఇస్తుంటే, ప్రజలు వచ్చి రూ.5వేలు వరకు డిమాండ్‌ చేశారని జేసీ ఇటీవల వ్యాఖ్యానించారు.

ఇక జేసీ వ్యాఖ్యలని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ, సీపీఐ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జేసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు… జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మాట్లాడడం నిజమేనని నిర్ధారించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: ఫలితాలకు ముందే జనసైనికులు షాకులు ఇస్తున్నారుగా….

- Advertisement -