
- Advertisement -
అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్ధి నచ్చకపోతే నోటా (నన్ ఆఫ్ ది ఎబౌవ్)ని ఎంచుకోవచ్చు. అయితే గత ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికల్లో నోటాకి గణనీయంగా ఓట్లు పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నియోజకవర్గానికి నోటాకి కనీసం 1000 ఓట్ల పైనే వచ్చాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేసిన కుప్పం, వైసీపీ అధినేత జగన్ పోటీ చేసిన పులివెందులలో నోటాకి ఓట్లు ఎక్కువగానే వచ్చాయి.
కుప్పం నియోజవర్గంలో ఏకంగా 2905 మంది నోటాకు వేశారు. అంటే బాబు సహా ప్రత్యర్థి వారికి నచ్చలేదని అర్థమవుతోంది. ఇక ఇక్కడ జనసేన అభ్యర్ధికి అయితే నోటా కంటే తక్కువ వచ్చాయి. జనసేన అభ్యర్ధి వెంకటరమణకి 1879 ఓట్లు పడ్డాయి.
అటు జగన్ పోటీ చేసిన పులివెందులలో 2156 ఓట్లు నోటాకి వేశారు. అంటే వీరికి జగన్‌తో సహ మిగతా అభ్యర్ధులు ఎవరు నచ్చలేదు.
చదవండి: జంపింగ్‌లు షురూ: వైసీపీలో చేరనున్న కర్నూలు టీడీపీ నేతలు..
- Advertisement -








