29.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ జంపింగ్‌లు షురూ: వైసీపీలో చేరనున్న కర్నూలు టీడీపీ నేతలు..

జంపింగ్‌లు షురూ: వైసీపీలో చేరనున్న కర్నూలు టీడీపీ నేతలు..

TDP Leaders Latest News, YCP Latest News, AP Political News, Newsxpressonline
- Advertisement -

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీలోకి వలసలు షురూ అయ్యాయి. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి…ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వైసీపీలో చేరేందుకు టీడీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా టీడీపీ పార్టీకి సేవలు అందించిన కర్నూలుకి చెందిన కప్పట్రాళ్ల కుటుంబం త్వరలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కూతురు, ఆస్పరి జడ్పీటీసీ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఆమె భర్త దేవనకొండ ఎంపీపీ రామచంద్రనాయుడు వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది.

కాగా, కప్పట్రాళ్ల వెంకప్పనాయుడు కుటుంబం గత 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోంది. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వెంకటప్పనాయుడు టీడీపీ ముఖ్యనాయకుడు కేఈ కృష్ణమూర్తి వర్గీయుడు. అయితే ఎన్నికల సమయంలో కోట్ల, కేఈ వర్గాలు ఒక్కటయ్యాయి.

దీన్ని వ్యతిరేకించిన కప్పట్రాళ్ళ బొజ్జమ్మ ఆలూరు వైసీపీ అభ్యర్థి జయరాంకి మద్దతు పలికారు. ఇక తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జయరాం భారీ మెజారిటీతో టీడీపీ నుంచి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి సుజాతమ్మపై విజయం సాధించారు.

చదవండి: ఎన్డీయేలోకి వైసీపీ.. జగన్‌కి అమిత్ షా ఆహ్వానం…?
- Advertisement -