22.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ షాకింగ్: ఆ నియోజకవర్గంలో టీడీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు…

షాకింగ్: ఆ నియోజకవర్గంలో టీడీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు…

TDP Latest news, AP latest Political News, AP Election News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం 23 స్థానాల్లోనే గెలిచింది.

అయితే మెజారిటీ సీట్లలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిన టీడీపీ…కొన్ని స్థానాల్లో పూర్తిగా చేతులెత్తేసింది. ఈ క్రమంలోనే టీడీపీకి షాక్ తగిలే విషయం ఒకటి తెలిసింది. ఎవరు ఊహించని విధంగా టీడీపీ అరకు నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయింది.

మొత్తం 175 స్థానాల్లో కేవలం టీడీపీ అభ్యర్ధి శ్రావణ్‌కుమార్‌ ఒక్కరే డిపాజిట్‌ కోల్పోవడం గమనార్హం.! కాగా అరకులోయ అసెంబ్లీ నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్ధి ఫాల్గుణ 25, 295 ఓట్ల మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థి సియ్యారి దొన్నుదొరపై గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి సియ్యారి దొన్నుదొర 27,660 ఓట్లతో డిపాజిట్‌ను దక్కించుకున్నారు.

కానీ మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌కు కేవలం 19,929 ఓట్లు మాత్రమే దక్కడంతో డిపాజిట్‌ కోల్పోవాల్సి వచ్చింది. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 1/6 శాతం ఓట్లు పొందిన వారికే డిపాజిట్‌ దక్కుతుంది. ఆ లెక్కన ఇక్కడ 1,57,575 ఓట్లు పోలవ్వగా… డిపాజిట్‌ దక్కాలంటే కనీసం 26,263 ఓట్లు రావాలి.

చదవండి: వైసీపీ రికార్డు: అతి చిన్న వయసులో ఎంపీ అయిన మాధవి…  
- Advertisement -