26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ కీలకవ్యాఖ్యలు!

ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ కీలకవ్యాఖ్యలు!

YS Jagan Latest News, AP Latest News, AP Notification News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీ సీఎంగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను కలిసిన అధికారులతో ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం . ప్రభుత్వ ఉద్యోగులకు సంబధించి ప్రత్యేకించి పని విషయంలో జగన్ వారికి ఒకే భరోసా ఇచ్చారు.

‘పని వేళల్లో మాత్రమే పని, వర్కింగ్ అవర్స్ అయిపోయాకా మీరు ఇంటికి వెళ్లి పోవచ్చు, అని అధికారులకు జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రుల వరకూ సమీక్షల పేరుతో విసిగించేది ఉండదని అర్థం లేని సమీక్షలు కూర్చోబెట్టి చెప్పిందే చెప్పడం ఉండదని జగన్ అధికారులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.

ఇది వరకూ చంద్రబాబు నాయుడు పాలనలో అసలు విషయం తక్కువ సమీక్షలు ఎక్కువ.. అన్టన్టుగా ఉండేది వ్యవహారం అనే పేరుంది. చంద్రబాబు నాయుడు గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇటీవల ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సమీక్షల పేరుతో అధికారులను విసిగించేశారనే కామెంట్ వినిపించింది.

అధికారులతో చంద్రబాబు ఒక రేంజ్ లో సమీక్షలు నిర్వహించేస్తున్నారనే ప్రచారం వచ్చినా ప్రజలు చంద్రబాబును మళ్లీ సీఎంగా చేయలేదంటే, పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే కాబోలు జగన్ చాలా స్పష్టతతోనే కనిపిస్తూ ఉన్నారు. దీనితోనే ప్రమాణ స్వీకారానికి ముందే వారికి భరోసాను ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

చదవండి:  ప్రమాణస్వీకారానికి చంద్రబాబుని ఆహ్వానించనున్న జగన్…?
- Advertisement -