ఆసక్తికరం: నాడు 151 మంది మద్దత్తు ఇస్తే కాదన్నారు.. నేడు అదే 151 మందితో సీఎం!

YS Jagan Latest Updates, YCP MLAs News, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఈ భూ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. ఒకదానికి మరొకదానికి లింకు ఉంటుంది. కొంచెం తీక్షణంగా చూస్తే ఇలాంటివి మనకి కనిపిస్తాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఒక సీతాకోకచిలుక రెక్కలు ఆడిస్తే, మరెక్కడో దాని ప్రభావం ఉంటుందంటూ ‘నాన్నకి ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్ ఒక చిన్న లాజిక్ చెబుతాడు.

చదవండి: జూన్ 8న ఏపీ మంత్రివర్గం విస్తరణ….!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో 151 అంకెను విశ్లేషించినప్పుడు ఇదే విషయం కనిపించకమానదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ అయిన వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.

ఇక విషయానికొస్తే… దివంగత మహానేత, మాజీ సీఎం వైఎస్ మరణం నేపథ్యంలో జగన్‌ను ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలంటూ 151 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పట్లో సంతకాలు చేసిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదు.

అప్పట్లో అంతమంది ఎమ్మెల్యేల అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం కొణిజేటి రోశయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

చదవండి: కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్: వైసీపీలో చేరనున్న సీనియర్ నేత…
ఇది జరిగిన సరిగ్గా పదేళ్లకు మళ్లీ 151 మంది ఎమ్మెల్యేలతో జగన్ ముఖ్యమంత్రి కావటం ఆసక్తికరమైన అంశంగా చెప్పవచ్చు. నాడు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం అహంభావంతో కాదంటే, ఈ రోజున ప్రజలే నేరుగా ఓట్లేసి మరీ 151 మందిని జగన్ వర్గంగా డిసైడ్ చేశారని చెప్పాలి.
 
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 151 అంకెను ఎటువైపు నుంచి చూసినా 151 రావటం కనిపిస్తుంది. ఇదో ప్రత్యేకత అయితే 2014లో పవర్లోకి వచ్చిన చంద్రబాబు జగన్ కు చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తన వైపు లాగేసుకుంటే, తాజాగా ఎన్నికల్లో టీడీపీ తరపున కేవలం 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలు విజయం సాధించారు.
చదవండి: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా సోనియా గాంధీ ఎన్నిక…
అలాగే 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబుకు కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి. తాజాగా వైఎస్ కుమారుడు జగన్ ముఖ్యమంత్రి గా ఎన్నికైన సమయంలో నాడు వైఎస్ కు వచ్చిన సీట్లలో సగం 23 సీట్లే చంద్రబాబు పార్టీకి రావటం జరిగింది. ఇలా జగన్ కు సంబంధించి అంకెల్లో ఆసక్తికర అంశాలు ఇప్పుడు ప్రజల మధ్య చర్చగా మారాయి. 
 
- Advertisement -