28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు ముందే జనసైనికులు షాకులు ఇస్తున్నారుగా….

ఫలితాలకు ముందే జనసైనికులు షాకులు ఇస్తున్నారుగా….

janasena-chief-pawan-kalyan
- Advertisement -

అమరావతి: ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకి జరిగిన ఎన్నికల ఫలితాలు మరో 20 రోజుల్లో వెలువడనున్న విషయం తెలిసిందే. అయితే ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని టీడీపీ-వైసీపీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక జనసేన కూడా ఊహించని విధంగా సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఫలితాలు ఎలా వస్తాయో తెలియకపోయిన….వాటికంటే ముందే జనసేనకు ఆ పార్టీ నేతలు షాకులు ఇస్తున్నారు. వరుసగా పార్టీని వీడుతూ….పవన్ కల్యాణ్‌కి ఊహించని షాక్ ఇస్తున్నారు.  గురువారం ఆ పార్టీ సీనియర్ నేత, కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు అధినేత పవన్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించిన రాఘవయ్య హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేయడం సొంతపార్టీ నేతలను షాక్‌కి గురిచేసింది. ఆయన వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడానని చెబుతున్నా…వేరే కారణాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. ఇక రాఘవయ్యతోపాటు మరో నేత అర్జున్ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. అలాగే మొన్న ఎన్నికల్లో టికెట్లు దక్కని కొందరు జనసేన నేతలు ఫలితాల తర్వాత పార్టీ మారడానికి చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

చదవండి: గెలిచేది టీడీపీయే.. కావాలనే పందేలు.. అదంతా వైసీపీ మైండ్ గేమ్: చంద్రబాబు

- Advertisement -