23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మేమూ సర్జికల్ స్ట్రైక్స్ చేశాం…మీలా ఛాతీ చరుచుకోలేదు: బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్

మేమూ సర్జికల్ స్ట్రైక్స్ చేశాం…మీలా ఛాతీ చరుచుకోలేదు: బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్

- Advertisement -

ఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ ఆర్మీ చేసిన సర్జికల్ దాడులని ప్రధాని మోడీ, బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అసలు తమ హయాంలోనే ఎక్కువ సర్జికల్ దాడులు జరిగాయని చెబుతూ…కాంగ్రెస్ బీజేపీకి కౌంటర్ ఇచ్చింది.

యూపీఏ పాలనలో 2008 నుంచి 2014 మధ్య పాకిస్థాన్ పై భారత సైన్యం ఆరుసార్లు సర్జికల్ దాడులను నిర్వహించిందని, వాటిని బయటకు చెప్పుకోలేదని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా ప్రకటించారు. ఇక ఎప్పుడెప్పుడు సర్జికల్ దాడులు చేశామన్న విషయాన్ని తేదీలతో సహా ప్రకటిస్తూ, ఫోటోలను విడుదల చేశారు.

కాంగ్రెస్ సర్జికల్ స్టైక్స్ చేసిన తేదీలు

2008 జూన్ 19: జమ్మూకాశ్మీర్‌లోని భట్టాల్ సెక్టార్

2011 ఆగస్ట్ 30 – సెప్టెంబర్ 1: నీలం రివర్ వ్యాలీ శారద సెక్టార్లో

2013 జూన్ 6: సావన్ పాత్రా చెక్‌పోస్ట్

2013 జూలై 27-28: నాజాపిర్ సెక్టార్

2013 ఆగస్ట్ 6: నీలమ్ వ్యాలీ

2014 జనవరి 14న ఆరో సర్జికల్ స్ట్రైక్

అలాగే వాజ్‌పేయి హయాంలో కూడా రెండుసార్లు సర్జికల్ దాడులు జరిగాయని శుక్లా తెలిపారు. మన్మోహన్ పాలనలో ఆరుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామని, కానీ తాము ఎప్పుడూ ఛాతీ విరుచుకుని చెప్పలేదని అన్నారు. ఒక్క సర్జికల్ స్ట్రైక్ చేసిన వ్యక్తి ఏదో గొప్పలు చెబుతున్నారని, వాజ్‌పేయి కానీ, మన్మోహన్ సింగ్ కానీ ఎక్కడా గొప్పలు చెప్పలేదని శుక్లా చెప్పుకొచ్చారు.

చదవండి: గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్…16 మంది జవాన్లు మృతి… తీవ్రంగా స్పందించిన మోడీ….

- Advertisement -