23.8 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం కరోనా ఎఫెక్ట్.. ఇప్పుడిదే పర్‌ఫెక్ట్!.. ట్రెండ్ అవుతున్న నయా చాలెంజ్!

కరోనా ఎఫెక్ట్.. ఇప్పుడిదే పర్‌ఫెక్ట్!.. ట్రెండ్ అవుతున్న నయా చాలెంజ్!

- Advertisement -

హైదరాబాద్: కరోనా వైరస్‌ మరింత విస్తరించకుండా దేశంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్ యువతలో నయా చాలెంజ్‌కు పురికొల్పుతోంది.

లాక్‌డౌన్ కారణంగా బార్బర్ షాపులు కూడా మూతపడడంతో గడ్డాలు తొలగించుకునే మార్గం కనిపించడం లేదు. దీంతో కొందరు యువకులు దీనినో ‘చాలెంజ్’గా మార్చేసి దానికి ‘బియర్డ్ చాలెంజ్’ (గడ్డం చాలెంజ్)గా నామకరణం చేసేశారు.

స్నేహితులు, తెలిసినవారికి ఫొటోలు పంపి వారిని కూడా ఈ చాలెంజ్‌లో భాగస్వామ్యం చేస్తున్నారు.  దీంతో ఇప్పుడిది విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.

లాక్‌డౌన్‌లో గెడ్డాన్ని అందంగా పెంచుకోవడమే ఈ చాలెంజ్. తాను 19 రోజులుగా వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో గడ్డాన్ని అలాగే వదిలేశానని మాదాపూర్‌కు చెందిన టెకీ పి.రాధాకృష్ణ తెలిపారు.

తాను ఇంట్లోనే బందీగా ఉండిపోయాయని, కాబట్టి ఇప్పుడు ట్రిమ్ లుక్‌తో పనిలేదని కార్పొరేట్ ఉద్యోగి ధన్‌రాజ్ రెడ్డి తెలిపాడు. ప్రతీ రోజూ గడ్డం గీసుకునే బాధ తప్పిందని, ఇలా ఉండడం హాయిగా ఉందని పేర్కొన్నాడు. 

తాను కొన్ని రోజులపాటు గడ్డాన్ని గీసుకోలేదని, ఆ తర్వాత చూస్తే అది తనకు బాగానే సూటైందని అనిపించిందని ఎతేశం అనే ఇంజీనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి పేర్కొన్నాడు.

గడ్డంతో ఉన్న తన ఫొటోను వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తే అందరూ మెచ్చుకున్నారని, దీంతో దానిని అలాగే కంటిన్యూ చేస్తున్నానని తెలిపాడు.

అంతా బాగానే ఉంది కానీ, ఇప్పటికే గడ్డం ఉన్నవారికి ఇది నిజంగా ‘చాలెంజే’. ఇప్పటికే ముఖాన్ని ఆక్రమించిన గడ్డాన్ని తొలగించుకోకుండా ఇంకా పెంచుకోవడం కొంత ఇబ్బందికరమేనని అంటున్నారు.

ముఖాన్ని కప్పివేసే గడ్డంతో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
ఇది ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు హాలీవుడ్ స్టార్లు కూడా ఈ బియర్డ్ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు.

ప్రముఖ హాలీవుడ్ స్టార్ అయిన జిమ్ కేరీ, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, ఆర్.మాధవన్ వంటి వారు కూడా చాలెంజ్‌‌ను స్వీకరించి తమ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

- Advertisement -