33.6 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం 14న లాక్‌డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదు: అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు…

14న లాక్‌డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదు: అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు…

lockdown-likely-to-be-extended-pm-modi-suggests-at-all-party-meeting
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 14 వరకు విధించిన లాక్‌డౌన్ ఆ గడువు ముగిసిన తరువాత ఎత్తివేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేశారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్షంతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

చదవండి: కరోనా వైరస్: ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు!

సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి నానాటికీ విస్తరిస్తోన్న క్రమంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌‌డౌన్‌ను ఒకేసారి ఎత్తివేయడం కూడా ప్రమాదకరమేనని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయమై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నట్లు తెలుస్తోంది. 

దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేతకే కేంద్రం మొగ్గు?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా కట్టడి కాని నేపథ్యంలో తొందరపడి లాక్‌డౌన్ ఎత్తివేయడం మంచిది కాదనే అభిప్రాయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడడానికి, ప్రాథమిక రంగాలు తిరిగి పని చేయడానికి వీలుగా లాక్‌డౌన్ చర్యలు ఉండాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నెల 14న తొలిదశ లాక్‌డౌన్ ముగుస్తుందని, ఆ తరువాత కూడా నాలుగు వారాలపాటు షాపింగ్ మాల్స్‌ను మూసి ఉంచాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశం కూడా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు కూడా హాజరయ్యారు. 

చదవండి: కరోనా వైరస్: తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. మృతుల అంత్యక్రియలపై మార్గదర్శకాలు విడుదల!

మరోవైపు విద్యా సంస్థలు కూడా వచ్చే వారం ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. విద్యా సంస్థలను మరో నాలుగు వారాటపాటు మూసివేయాలని, అలాగే మత సమ్మేళనాలు, సమావేశాలపై కూడా నిషేధం కొనసాగాలని మంత్రుల బృందం సూచించినట్లు తెలుస్తోంది.  

శనివారం సీఎంలతో సమావేశం తరువాతే…

మరోవైపు లాక్‌డౌన్‌ను కొనసాగించాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.  ఎందుకంటే, ఈ నాలుగు రాష్ట్రాలు అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో సతమతం అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడితన తరువాతే లాక్‌డౌన్‌పై కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

చదవండి: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఐశ్వర్యారాయ్ లీక్డ్ వీడియో.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు మరి!
చదవండి: కరోనా లాక్‌డౌన్: అమితాబ్ ఇంట్లో మల్టీస్టారర్ చిత్రం.. పేరు ‘ఫ్యామిలీ’, ఎవరు నటించారంటే..
- Advertisement -