27.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం కరోనా వైరస్: ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు!

కరోనా వైరస్: ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు!

odisha-cm-naveen-patnaik-announces-lockdown-period-extended-upto-april-30th
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను తమ రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. దీంతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.

చదవండి: కరోనా వైరస్: తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. మృతుల అంత్యక్రియలపై మార్గదర్శకాలు విడుదల!

నిజానికి కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశంలో విధించిన ఈనెల 14 వరకు ప్రధాని నరేంద్ర మోడీ విధించిన లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులుపాటు పొడిగించాలా? వద్దా? అనే విషయమై తర్జన భర్జనలు జరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ఒకడుగు ముందుకేసి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఒడిశా బాటలో మరిన్ని రాష్ట్రాలు…?

మరోవైపు లాక్‌డౌన్ పాటిస్తున్నప్పటికీ దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశా బాటలోనే మరిన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే అభిప్రాయంలో ఉన్నారు. 

కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఇంకా రాని తరుణంలో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయడం మినహా మరో గత్యంతరం లేదని ఆయన ఇప్పటికే సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని తాను వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇప్పటికే ప్రధాని మోడీ దృష్టికి కూడా తీసుకెళ్లానని ఆయన చెబుతున్నారు.

చదవండి: మా నుంచి మా వాళ్లకు సోకితే పరిస్థితి ఏంటి?.. కన్నీరు పెట్టుకున్న వైద్యురాలు

ఈ నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఈనెల 14తో ముగుస్తున్న నేపథ్యంలో.. అందరి దృష్టి ఈ అంశంపైనే ఉంది. లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగిస్తుందా? లేకపోతే ఎత్తివేస్తుందా? అనే చర్చలు సర్వత్రా జరుగుతున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేతకు మొగ్గుచూపినా.. దీనిని కొనసాగించాలంటూ పలు రాష్ట్రాల సీఎంలు ఒత్తిడి చేయవచ్చు.

- Advertisement -