లాక్‌డౌన్ మరో రెండు వారాల పొడిగింపు.. కేంద్రం ఆలోచన ఇదే!

- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేంద్రం యోచిస్తోంది.

దేశంలో విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేందుకు గత నెల 24న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు.

ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్‌ సదస్సు తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. దేశంలోని దాాదాపు అన్ని ప్రాంతాలకు ఈ వైరస్ విస్తరించింది.

కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనుంది. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోగా, మరింత ఆందోళనకరంగా మారాయి. 

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించడమే శ్రేయస్కరమని భావిస్తున్న ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

లాక్‌గడువు ముగియడానికి ముందే పొడిగింపును అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.  

 
- Advertisement -