22.7 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం లాక్‌డౌన్ ఉల్లంఘన.. ప్రశ్నించిన పోలీసు చేయి నరికేసిన నిందితులు

లాక్‌డౌన్ ఉల్లంఘన.. ప్రశ్నించిన పోలీసు చేయి నరికేసిన నిందితులు

- Advertisement -

చండీగఢ్: లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో ఆదివారం ఉదయం పటియాలాలోని ఓ వెటిటేబుల్ మార్కెట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, మరికొందరిపై కత్తులతో దాడి చేసిన ఘటలో ఏడుగురు అనుమానితులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బల్బెరా గ్రామంలోని గురుద్వారలో దాక్కొని ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నిందితులను ఆపడానికి పోలీసులు కాల్పులు జరిపారని, ఓ నిందితుడు గాయపడ్డాడని ఆయన వెల్లడించారు.

కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించామని పంజాబ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేబీఎస్ సిద్దూ తెలిపారు. ఈ ఆపరేషన్‌ను పాటియాలా జోన్ ఐజీ జతీందర్ సింగ్ ఔలఖ్ పర్యవేక్షించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ ఉదయం పటియాలా మార్కెట్‌కు కారులో వచ్చిన నిహంగ్ వర్గానికి చెందిన కొందరు బారికేడ్లను ఢీకొట్టి ముందుకు దూసుకొచ్చారు.

దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ప్రశ్నించారు. కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి ఏఎస్ఐ హర్జీత్‌ సింగ్‌పై తల్వార్‌తో దాడి చేశాడు. దీంతో ఆయన చేయి తెగిపడింది. ఘటనలో మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

గాయపడిన ఏఎస్‌ఐని సర్జరీ కోసం చండీగఢ్‌కు తరలించారు.  ఆయనకు డాక్టర్లు సర్జరీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనటలో హర్జీత్ సింగ్‌తో పాటు మండీ బోర్డు అధికారి గాయపడిన్నట్లు తెలిపారు.

- Advertisement -