23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మందుబాబులు ఎగిరి గంతేసే వార్త చెప్పిన మేఘాలయ సర్కార్

మందుబాబులు ఎగిరి గంతేసే వార్త చెప్పిన మేఘాలయ సర్కార్

- Advertisement -

షిల్లాంగ్:  లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో మందుబాబులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కొందరైతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మద్యం ప్రియుల ఇబ్బందుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మేఘాల‌య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

రేపటి(సోమవారం) నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో మద్యం షాపులు తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఆరు రోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండనున్నట్లు మేఘాలయ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

వినియోగదారులు దుకాణాల వద్ద మీటరు దూరం పాటించాలని పేర్కొంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం, లేదంటే ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లడంపై నిషేధం ఉంటుందన్న ప్రభుత్వం కేవలం ఇంటికి ఒక్కరినే వైన్ షాపు దగ్గరకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. 

- Advertisement -