
హైదరాబాద్: లాక్‌డౌన్ అమలు చేస్తుండటం వల్లే దేశంలో పరిస్థితి అదుపులో ఉందని, తెలంగాణ పోలీసులు 24 గంటలూ నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తుండడం వల్లే రాష్ట్రంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోందని వ్యాఖ్యానించారు టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ.
చదవండి: లాక్‌డౌన్‌పై కొత్త మార్గదర్శకాలు.. ఇక రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు!
బషీర్‌బాగ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద సీపీ అంజనీకుమార్‌తో కలిసి విజయ్ దేవరకొండ పోలీసు సిబ్బందికి ఫేస్ ప్రొటెక్షన్ షీల్డ్‌లను అందజేశాడు.
‘‘20 రోజులుగా నేను ఇంట్లోనే…’’
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను బయటి ప్రపంచాన్ని చూసి 20 రోజులవుతోందన్నాడు. లాక్‌డౌన్‌తో తాను పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానని చెప్పుకొచ్చాడు.
చదవండి: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త చెప్పిన మేఘాలయ సర్కార్
ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని కోరాడు. కొందరు నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల మీదకు వస్తున్నారని, అలా వచ్చి పోలీసులు, వైద్యులపై భారం వేయొద్దని విజయ్ దేవరకొండ కోరాడు.
Shield masks distribution for Corona virus protection by Telangana Doctors Federation (TSDF) to Hyderabad city police.
https://t.co/79x4orbbAR— C.V.ANAND, IPS (@CPHydCity) April 11, 2020








