25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం కరోనా కేసుల్లో ప్రపంచ జాబితాలో 12వ స్థానానికి ఎగబాకిన భారత్

కరోనా కేసుల్లో ప్రపంచ జాబితాలో 12వ స్థానానికి ఎగబాకిన భారత్

coronavirus-positive-cases-cross-49000-in-india
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రపంచ జాబితాలో భారతదేశ స్థానం ఎగబాకుతోంది.

ప్రస్తుతం ఈ జాబితాలో చైనా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. 82,900కుపైగా కేసులతో చైనా 11వ స్థానంలో ఉండగా, నిన్నటి గణాంకాల ప్రకారం 70,756 కేసులతో భారత్ ఆ తర్వాతి స్థానంలో ఉంది.

గత నెల రోజులుగా దేశంలో మరణాల రేటు 3.23 దగ్గర స్థిరంగా ఉన్నప్పటికీ విపరీతంగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

రికవరీ రేటు మాత్రం గణనీయంగా పెరిగిది. 9.05 శాతం నుంచి ఏకంగా 31.73కు పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం.

దీంతోపాటు గత 24 గంటల్లో 24 రాష్ట్రాల్లో మరణాలు సంభవించకపోవడం, 10 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

అలాగే, 9 రాష్ట్రాల్లో మరణాలు సంభవించగా, అందులో 64 శాతం మహారాష్ట్ర, గుజరాత్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం.

ఇక, దేశంలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి 28 వేలకు చేరుకోవడానికి 83 రోజులు పట్టగా, గత 8 రోజుల్లో దాదాపు అన్నే కేసులు నమోదయ్యాయి.

చైనాతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ రికవరీ రేటు మాత్రం మూడు రెట్లు ఎక్కువగా 94.27 శాతం ఉంది.

- Advertisement -