
- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం నాటికి కరోనా వైరస్‌తో 2,293 మంది మృతి చెందగా, మొత్తం కేసులు 70,756కు చేరుకున్నాయి.
ఈ మహమ్మారితో 24 గంటల్లో 87 మంది చనిపోగా కొత్తగా 3,604 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
వైరస్ బారిన పడి ఇప్పటివరకు 22,454 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా రికవరీ రేటు 31.74 శాతంగా ఉందని పేర్కొంది.
కోవిడ్ బాధిత మృతుల్లో 70 శాతం వరకు ఇతర అనారోగ్య సమస్యల వల్లే సంభవించాయని తెలిపింది. దేశంలో కరోనా కేసులు రెట్టింపయ్యే సమయం 10.9 రోజుల నుంచి 12.2కు చేరుకుందని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.
దేశంలోని 347 ప్రభుత్వ, 137 ప్రైవేట్ ల్యాబొరేటరీలకు రోజులో ఒక లక్ష కోవిడ్–19 పరీక్షలు జరిపే సామర్థ్యముందన్నారు. ఇప్పటి వరకు 17,62,840 పరీక్షలు జరగ్గా, మంగళవారం ఒక్కరోజే 86,191 నమూనాలను పరీక్షించారని ఆయన వెల్లడించారు.
- Advertisement -








