26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ పవన్ కళ్యాణ్ 28వ చిత్రం.. ఒక హీరోయిన్‌గా మలయాళీ బ్యూటీ మానస!?

పవన్ కళ్యాణ్ 28వ చిత్రం.. ఒక హీరోయిన్‌గా మలయాళీ బ్యూటీ మానస!?

- Advertisement -

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 28వ చిత్రాన్ని ‘గబ్బర్ సింగ్’ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించబోతున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యం వహించనున్నారు.

ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు? ఈ చిత్రంలో హీరోయిన్ ఒక్కరా? లేక ఇద్దరా? ఇది పవన్ అభిమానుల్లో ఎంతో ఉత్సుకత రేకెత్తిస్తోన్ ప్రశ్న.

చదవండి: ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్న సినీ నటుడు రానా.. శుభాకాంక్షల వెల్లువ

మరోవైపు పవన్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై 8 ఏళ్లు పూర్తవడం సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. పవన్ అభిమానులు ఏకంగా 13 మిలియన్ల ట్వీట్లతో సోషల్ మీడియాలో ఒక మోత మోగించారు. 

హీరోయిన్‌గా కొత్త అమ్మాయి…?

ఇక పవన్ తాజా చిత్రానికి సంబంధించిన ఒక వార్త వైరల్‌గా మారింది. చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రంలో పవన్ సరసన నటించేందుకు నూతన తార కోసం వెతుకుతున్నారన్నది ఆ వార్త సారాంశం.

ఈ క్రమంలో మలయాళీ బ్యూటీ మానస రాధాకృష్ణన్ పేరు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. 21 ఏళ్ల మానసది చూడగానే ఆకర్షించే రూపం.  ప్రస్తుతం మలయాళం, తమిళ చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. 

చదవండి: ‘డిన్నర్’ అంటే అదే.. క్యాస్టింగ్ కౌచ్ సీక్రెట్ కోడ్ వర్డ్ బయటపెట్టేసిన కామసూత్ర బ్యూటీ

అయినప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ మానస పేరునే పరిశీలిస్తున్నారంటే.. బహుశా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

ఒకవేళ నిజంగానే మానస రాధాకృష్ణన్‌ను పవన్ సరసన ఒక హీరోయిన్‌గా కనుక బుక్ చేస్తే.. ఆమెకు తెలుగులో ఇదే తొలి చిత్రం అవుతుంది. 

- Advertisement -