

కబుర్లు చెప్పడం ఆపి, పాకిస్థాన్ తో యుద్ధం చేసేందుకు కదలాలని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, ట్విట్టర్ వేదికగా తనలోని ఆవేదనను వ్యక్తం చేశాడు.
ఇక మాటల్లేవని, యుద్ధమే ఉగ్రవాద సమస్యకు పరిష్కారమని అన్నారు. వేర్పాటు వాదులను ఉపేక్షిస్తుంటే ఇలాంటి ఘటనలే పునరావృతమవుతుంటాయని హెచ్చరించిన గంభీర్, పాక్ తో యుద్ధం చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
Yes, let’s talk with the separatists. Yes, let’s talk with Pakistan. But this time conversation can’t be on the table, it has to be in a battle ground. Enough is enough. 18 CRPF personnel killed in IED blast on Srinagar-Jammu highway https://t.co/aa0t0idiHY via @economictimes
— Gautam Gambhir (@GautamGambhir) February 14, 2019
“ఇక జరిగింది చాలు. వెంటనే వేర్పాటువాదులు, పాకిస్తాన్‌తో మాట్లాడనివ్వండి. కానీ ఈ సంభాషణ అనేది గదుల్లో కాకుండా.. యుద్ధ మైదానంలో ఉండాలి” అని ట్వీట్ చేశారు. గంభీర్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుండగా, ఆయనకు మద్దతు పలుకుతూ, యుద్ధానికి దిగాల్సిందేనని స్పందిస్తున్నారు నెటిజన్లు.
సంబంధిత వార్తలు
అతిపెద్ద ఉగ్రదాడి: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి, 40 మంది జవాన్లు మృతి
ఆలోగా నేను స్వర్గంలో ఉంటా: ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్
పుల్వామా ఘటన : పక్కా ప్లాన్‌తోనే దాడి? అమరులైన 43 మంది జవాన్లు!
పాకిస్థాన్‌కు ఎంఎఫ్ఎన్ హోదా ఉపసంహరించిన భారత్, తక్షణమే అమల్లోకి








