

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. 24 గంటల్లో 4 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ దేవుళ్ల ఆశీర్వాదం తమ సినిమాపై ఉండటం వల్లే ఇది సాధ్యమైందని, ఎన్టీ రామారావు కూడా పై నుంచి బ్లెస్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
యూట్యూబ్ లో వైరల్ గ ట్రైలర్…
కాగా, నిన్న ట్రైలర్ వదిలినప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో చేసిన హడావుడి కూడా చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు, కేసీఆర్, మోడీ, రాహుల్ గాంధీ చివరకు డొనాల్డ్ డ్రంప్ కూడా తమ మూవీ ట్రైలర్ చూసినట్లు వర్మ కొన్ని ఫోటోలు షేర్ చేయడం గమనార్హం. చిరంజీవి, జూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఫోటోలను కూడా తమ ట్రైలర్ పబ్లిసిటీకి వాడేశాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసిన తర్వాత రాహుల్ గాంధీ ఆలోచనలో పడ్డారా, అనే సందేహం వ్యక్తం చేస్తూ వర్మ వ్యాఖ్యలు చేశారు. మరోపోస్ట్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘యాత్ర’ దర్శకుడితో కలిసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ చూస్తున్నట్లు వర్మ మరో పోస్టులో వెల్లడించడం జరిగింది .
ఈని గురించి నీకు ముందుగాలే జెప్పినగదరా’ అని లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసిన తర్వాత కేసీఆర్.. కేటీఆర్‌కు చెప్పినట్లు ఉన్న పిక్ పోస్ట్ ఫన్ క్రియేట్ చేస్తోంది. అలాగే మోడీ చూస్తున్నట్టు కూడా ఒక పిక్ ని పెట్టాడు.ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రచారకుడు కెఏ పాల్… అమెరికా అధక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్రైలర్ పంపడంతో అతడు కూడా ఈ ట్రైలర్ వీక్షించినట్లు వర్మ ఫోటో క్రియేట్ చేశారు
చివరికి వర్మ మాయాబజార్ సినిమాను కూడా వదల్లేదు. ఇలా రకరకాల పోస్టులతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ట్రైలర్‌కు విపరీతంగా పబ్లిసిటీ పెంచే ప్రయత్నం చేశారు.
Is he having second thoughts ? #LakshmisNTRtrailer pic.twitter.com/ena6cgnK7e
— Ram Gopal Varma (@RGVzoomin) February 14, 2019
Never saw @ysjagan watching something as seriously like he’s watching #LakshmisNTRTrailer https://t.co/Otvxvi35u2 pic.twitter.com/1gIqzDj22G
— Ram Gopal Varma (@RGVzoomin) February 14, 2019
KCR telling @KTRTRS “Yeeni gurinchi neeku mundhugaale jeppina gadhara” #LakshmisNTR https://t.co/OtvxvikGlA pic.twitter.com/fhLU8333dM
— Ram Gopal Varma (@RGVzoomin) February 14, 2019
This is what I said in my Guntur speech about #LakshmisNTR https://t.co/Otvxvi35u2 pic.twitter.com/mUte1HeVo1
— Ram Gopal Varma (@RGVzoomin) February 14, 2019
Who’s watching #LakshmisNTRTrailer ? pic.twitter.com/oE3QuQRPji
— Ram Gopal Varma (@RGVzoomin) February 14, 2019
— Ram Gopal Varma (@RGVzoomin) February 14, 2019
Watching #LakshmisNTRTrailer pic.twitter.com/PHUraaJZKI
— Ram Gopal Varma (@RGVzoomin) February 14, 2019








