24.6 C
Hyderabad
Tuesday, November 3, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం భారత్‌లో ఆగని కరోనా విజృంభణ.. 78 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. 2,549 మంది మృతులు

భారత్‌లో ఆగని కరోనా విజృంభణ.. 78 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. 2,549 మంది మృతులు

covid19-positive-cases-in-india-cross-78000-mark
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78 వేలు దాటగా, ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 2549 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో 3,722 కొత్త కేసులు నమోదు అయ్యాయని, 134 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

చదవండి: షాక్ కొడుతోన్న కరెంటు బిల్లులు.. తీవ్ర అసహనంలో వినియోగదారులు

కరోనా బారిన పడి చికిత్స పొంది ఇప్పటి వరకు 26,235 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా, ఇంకా దేశ వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో  49,219 మంది చికిత్స పొందుతున్నారు.

గత నాలుగు రోజుల్లోనే 10 వేల పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో కేసుల సంఖ్య మరింత పెరగడానికి వలస కార్మికులు కూడా ఒక కారణమే. 

వలస కార్మికుల తరలింపు వల్లే…

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో వీరంతా ఆయా రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

వలస కార్మికులు లారీలు, ట్రక్కుల్లో పరిమితికి మించి ప్రయాణించడం, సామాజిక దూరం పాటించకపోవడం తదితర కారణాల కారణంగా కొత్త పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి.

చదవండి: ఒకప్పటి దక్షిణాది కథానాయికలతో.. ఇప్పుడు రొమాంటిక్ కామెడీ మూవీ..!

దేశ రాజధాని ఢిల్లీతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 1,495 పాజిటివ్ కేసులు నమోదుకాగా, తమిళనాడులో 509, గుజరాత్‌లో 364, ఢిల్లీలో 359, రాజస్థాన్‌లో 200 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

- Advertisement -