23.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం హెచ్ఐవీ మాదిరిగానే కరోనా.. బహుశా అంతం కాకపోవచ్చు: డబ్ల్యూహెచ్‌వో సంచలన వ్యాఖ్యలు…

హెచ్ఐవీ మాదిరిగానే కరోనా.. బహుశా అంతం కాకపోవచ్చు: డబ్ల్యూహెచ్‌వో సంచలన వ్యాఖ్యలు…

world health organization says coronavirus will never leave mankind
- Advertisement -

జెనీవా: కరోనా వైరస్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. హెచ్‌ఐవీ మాదిరిగానే ఈ వైరస్ కూడా బహుశా మనల్ని విడిచిపెట్టి పోదేమో అంటూ వ్యాఖ్యానించింది. 

గతంలో వచ్చిన హెచ్ఐవీ ఇప్పటికీ పోలేదు. హెచ్ఐవీకి వ్యాక్సిన్ రాలేదు కానీ మెరుగైన చికిత్స విధానం మాత్రం అందుబాటులోకి వచ్చిందంటూ డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వ్యవహారాల డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ వ్యాఖ్యానించారు.

చదవండి: భారత్‌లో ఆగని కరోనా విజృంభణ.. 78 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. 2,549 మంది మృతులు

బహుశా ఇప్పుడొచ్చిన కరోనా వైరస్ కూడా అలాంటిదే అని భావిస్తున్నాం. పరిస్థితి చూస్తోంటే బహుశా ఇది మానవాళిని అంటిపెట్టుకునే ఉంటుందనిపిస్తోంది అని ఆయన పేర్కొన్నారు.

దీన్ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కూడా ఇంకా రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి స్థాయి పెరిగేందుకు మరింత సమయం పట్టొచ్చు.. అప్పటి వరకు ఈ మహమ్మారి మనల్ని వదలకపోవచ్చు అని డాక్టర్ ర్యాన్ అభిప్రాయపడ్డారు.

చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. లక్షల మంది ప్రాణాలను కబళించిన ఈ వైరస్ ప్రజల ఆరోగ్యాన్నే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేస్తోంది.

‘‘మరింత అప్రమత్తత అవసరం…’’

లాక్‌డౌన్ ఆంక్షలను ఆయా దేశాలు సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్ అథనోమ్ కూడా సూచించారు.

చదవండి: కరోనా కేసుల్లో ప్రపంచ జాబితాలో 12వ స్థానానికి ఎగబాకిన భారత్

లాక్‌డౌన్‌ ద్వారా కోవిడ్19ను పూర్తిగా కట్టడి చేయవచ్చు, లాక్‌డౌన్ విధించినా కరోనా విజృంభణ ఆగడం లేదు కాబట్టి దాన్ని ఎత్తేయడమే మేలు.. అనే ఈ రెండు ఆలోచనలు తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. 

కోవిడ్19‌కు విరుగుడు వ్యాక్సిన్ కనుక్కోగలిగితే అది అతి పెద్ద ముందడుగు అవుతుందని, దాన్ని అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయడమే ప్రస్తుతం మానవాళి ముందున్న అతి పెద్ద కర్తవ్యమని పేర్కొన్నారు.

- Advertisement -