
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ విధించినా, ఇతర చర్యలు తీసుకుంటున్నా.. దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49 వేలు దాటింది.
దేశంలో కరోనా కేసులకు సంబంధించి బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,391.
చదవండి: లాక్‌డౌన్ 3.0: తెలంగాణలో మే 29 వరకు పొడిగింపు, ప్రజలు సహకరించాలన్న సీఎం కేసీఆర్
అలాగే ఇప్పటి వరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 1,694గా ఉంది. ఇక 14,183 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సగానికిపైగా కేసులు మూడు రాష్ట్రాల్లోనే…
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య.. 33,514 కాగా రికవరీ రేటు 28.71 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశంలో సగానికిపైగా కరోనా కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలోని మాలేగావ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 37 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, నాసిక్ జిల్లాలో 83 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
ఒడిశాలో బుధవారం కరోనా కారణంగా ఒకరు మరణించగా, ఈ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 177కు చేరింది. బీహార్ ప్రభుత్వం ఆరోగ్య శాఖ సిబ్బంది సెలవులను రద్దు చేసింది.
చదవండి: యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు.. ఇప్పుడు మెడకు చుట్టుకున్న రెండేళ్లనాటి ప్రోగ్రాం..








