

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ తాజాగా జరిపిన మెరుపు దాడులకు పుల్వామా దాడి తర్వాతి రోజే శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టిగానే బుద్ధి చెప్పాలని, పనిలోపనిగా పాకిస్తాన్‌కు కూడా ఒక హెచ్చరికగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా భారత్ చర్య ఉండాలని, ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఆ తర్వాత కార్యాచరణ అత్యంత గోప్యంగా జరిగిపోయింది. ఈ క్రమంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విషయం ఏ మాత్రం బయటకు పొక్కనీయకుండా మోడీ సర్కారు జాగ్రత్తలు తీసుకుంది. ఫలితమే పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న 300 మందికిపైగా ఉగ్రవాదులు హతం, భారత్‌కు ఘన విజయం సొంతమయ్యాయి.
భారత్‌పై మరో భారీ కుట్రకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారన్న సమాచారం అందిన నేపథ్యంలో.. మెరుపు దాడి జరిపి ఉగ్రవాదులను తుదముట్టించిన భారత భద్రతా దళాలపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
మెరుపుదాడులు ప్రణాళికలు ఎలా సాగాయంటే..
ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు చేసిన దాడిలో 40మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలను అప్పుడే భద్రతా దళాలు నిర్ణయించుకున్నాయి.
ఆ మరుసటి రోజైన ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడుల ప్రణాళికను ఐఏఎఫ్ ప్రభుత్వానికి అందజేసింది. దీనికి ప్రభుత్వం వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు సరిహద్దుల వెంట ఐఏఎఫ్, భారత సైన్యం సంయుక్తంగా నిఘాను పెట్టాయి. వివిధ మార్గాల్లో ప్రత్యర్థి శిబిరాల సమాచారాన్ని సేకరించాయి.
ఫిబ్రవరి 21న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నేతృత్వంలో లక్ష్యాలను నిర్దేశించారు. ఇక ఫిబ్రవరి 20-22 మధ్యలో దాడులు చేయాల్సిన ప్రదేశాలను గుర్తించి మ్యాప్‌లు సిద్ధం చేసుకొన్నాయి.
ఫిబ్రవరి 22వ తేదీన భారత వాయుసేనలో టైగర్ స్క్వాడ్రన్, బాటిల్ యాక్సెస్ స్క్వాడ్రన్‌లను పూర్తిగా సిద్ధం చేశారు. అదేరోజు రెండు స్క్వాడ్రన్ల నుంచి 12 మిరాజ్ 2000 జెట్ ఫైటర్లను ఈ ఆపరేషన్‌కు ఎంపిక చేశారు.
ఫిబ్రవరి 24వ తేదీన భారత్ మధ్య ప్రాంతంలోని గగనతలంపై ఆపరేషన్ ప్లాన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
ఇక ఫిబ్రవరి 26న ఆపరేషన్ చేపట్టబోయే ముందు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి ఆ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ క్లుప్తంగా వెల్లడించారు.
మొదటి దాడి మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ప్రారంభమైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని అయిన ముజఫరాబాద్‌కు 24 కిలోమీటర్ల దూరంలోని బాలాకోట్ ప్రాంతంపై భారత వాయుసేన 3.45 గంటల నుంచి 3.53 గంటల వరకూ బాంబుల వర్షం కురిపించింది. బాలకోట్
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ప్రాంతం.
మరో లక్ష్యం ముజఫరాబాద్ ప్రాంతంపై యుద్ధ విమానాలు 3.48 గంటల నుంచి 3.55 గంటల మధ్య దాడులు చేపట్టాయి. చకోటి ప్రాంతంపై 3.58 గంటల నుంచి 4.04 గంటల వరకూ జెట్ ఫైటర్స్ బాంబుల వర్షం కురిపించాయి. ఈ మెరుపు దాడుల్లో 300 మందికిపైగా ఉగ్రవాదులు
హతమైనట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.
సంబంధిత వార్తలు
- భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం
- విరుచుకుపడ్డ భారత వాయుసేన.. జైషే మహ్మద్ ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్ ధ్వంసం! ఎక్స్ క్లూజివ్ వీడియో…
- పుల్వామా ఘటనపై ప్రతీకారం తీర్చుకున్న భారత్! వైమానిక దాడిని ధ్రువీకరించిన పాకిస్తాన్…
- ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్! భారత వాయుసేనకు ప్రశంసల వెల్లువ…
- పాక్ పై దాడికి కారణాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే!
- వైమానిక దాడులు: మోదీ అత్యవసర కేబినెట్ సమావేశం
- సర్జికల్ స్ట్రయిక్స్ 2.0: సత్తా చాటిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్! కార్గిల్ యుద్ధంలోనూ జైత్రయాత్ర…
- శత్రువు ముందు తలొగ్గి ఉంటె బలహీనులమని కాదు! వైరల్ అవుతున్న ఆర్మీ ట్విట్!
- ‘సురక్షితమైన చేతుల్లోనే భారత్’: ఐఏఎఫ్ మెరుపుదాడిపై ప్రధాని మోడీ ఏమన్నారంటే…
- ప్రతిదాడికి సిద్ధమై.. వెనక్కి తగ్గిన పాక్ ఎయిర్ ఫోర్స్! సాయం కోసం చైనాకు ఫోన్, కానీ…
- లోపల గుబులు, పైకి గాంభీర్యం.. ఆదినుంచీ పాక్ ఎత్తుగడే ఇదే: భారత్ వైమానిక దాడిపై పాక్ ఇలా…
- దేనికైనా సిద్ధంగా ఉండండి: భారత దాడిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సీరియస్








