

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి దేశ రాజధాని ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళాలు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై జరిపిన మెరుపుదాడుల నేపథ్యంలో అందరి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైనే ఉంది.
అయితే, ఈ రోజు కూడా ప్రధాని మోడీ సాధారణ రోజులానే గడిపారు. ఢిల్లీలోని ఇస్కాన్ మందిరంలో నిర్వహిస్తున్న గీతా ఆరాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన మెట్రోలో ప్రయాణించారు.
https://twitter.com/TheIndiaEye/status/1100355048767475713
వయొలెట్ లైన్‌లోని ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్‌లో ప్రధాని మోడీ మెట్రో రైలు ఎక్కారు. కోచ్ లోపల కూర్చున్నాక ఆ మార్గంలో రోజూ ప్రయాణించేవారితో ప్రధాని మాట కలిపారు. వారు మోడీతో సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీ పడ్డారు. తన ప్రయాణంలో పక్కన కూర్చున్న కొందరు చిన్నపిల్లలతో కూడా ఆయన ముచ్చటించారు.
PM Modi takes Delhi Metro ride to attend ISKCON event!
Message is clear………Don't worry…….Country is in safe hands!#IndiaStrikesBack pic.twitter.com/tPyw815ccA
— Seema Choudhary (@Seems3r) February 26, 2019
ఆ తర్వాత ప్రధాని నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్‌లో దిగారు. కాగా, 670 పేజీలు, 800 కిలోల బరువైన అతి భారీ భగవద్గీత ఆవిష్కరణ చేసేందుకు ప్రధాని మోడీ మెట్రోలో వెళ్తున్న వీడియో ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ప్రధానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశం సురక్షితమైన చేతుల్లోనే ఉందని ఈ ఫొటో చూస్తే తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు.
https://twitter.com/utkarshkg/status/1100363906864664576








