

ఇస్లామాబాద్: భారత వైమానిక దళం చేపట్టిన మెరుపుదాడులను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. భారత దాడులపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌సీ)తో మంగళవారం అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం ఎన్‌ఎస్‌సీ దాడులను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
భారత్ దాడులపై తాము సమయం, సందర్భం చూసుకొని సరైన సమాధానమిస్తామని ప్రకటనలో పేర్కొంది. ‘బాలాకోట్ సమీపంలో ఉగ్రవాద స్థావరాలంటూ భారత్ చేసిన దాడులను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని వ్యాఖ్యానించింది.
‘మరోసారి భారత్ కల్పిత కథలు చెబుతూ నిర్ల్యక్షంగా వ్యవహరించింది. ఆ దేశ ఎన్నికల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ విధమైన చర్యకు దిగింది. భారత్ బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనను ప్రపంచ నేతల ఎదుట బహిర్గతం చెయ్యాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించుకున్నారు’ అని ఎన్‌ఎస్‌సీ తన ప్రకటనలో వెల్లడించింది.
సైన్యం, ప్రజలు సిద్ధంగా ఉండాలి..
పాక్ త్వరలో తీసుకోబోయే అన్ని చర్యలకు సైన్యం, దేశ ప్రజలు సంసిద్ధంగా ఉండాలని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సూచించినట్లు ఎన్‌ఎస్‌సీ తెలిపింది. సమావేశం అనంతరం ఇమ్రాన్ పార్టీ పీటీఐ కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేసింది. పాక్ ఎన్‌సీఏతో ప్రధాని బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పీటీఐ తెలిపింది.
భారత్ కాల్పుల ఉల్లంఘన విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాలని పాక్ భావిస్తోంది. భారత్ దాడి చేసిన ప్రదేశాన్ని వచ్చి చూసి నిజానిజాలేమిటో తెలుసుకోవాల్సిందిగా పాక్ అంతర్జాతీయ మీడియా ఆహ్వానించింది.
సంబంధిత వార్తలు
- భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం
- విరుచుకుపడ్డ భారత వాయుసేన.. జైషే మహ్మద్ ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్ ధ్వంసం! ఎక్స్ క్లూజివ్ వీడియో…
- పుల్వామా ఘటనపై ప్రతీకారం తీర్చుకున్న భారత్! వైమానిక దాడిని ధ్రువీకరించిన పాకిస్తాన్…
- ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్! భారత వాయుసేనకు ప్రశంసల వెల్లువ…
- పాక్ పై దాడికి కారణాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే!
- వైమానిక దాడులు: మోదీ అత్యవసర కేబినెట్ సమావేశం
- సర్జికల్ స్ట్రయిక్స్ 2.0: సత్తా చాటిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్! కార్గిల్ యుద్ధంలోనూ జైత్రయాత్ర…
- శత్రువు ముందు తలొగ్గి ఉంటె బలహీనులమని కాదు! వైరల్ అవుతున్న ఆర్మీ ట్విట్!
- ‘సురక్షితమైన చేతుల్లోనే భారత్’: ఐఏఎఫ్ మెరుపుదాడిపై ప్రధాని మోడీ ఏమన్నారంటే…
- ప్రతిదాడికి సిద్ధమై.. వెనక్కి తగ్గిన పాక్ ఎయిర్ ఫోర్స్! సాయం కోసం చైనాకు ఫోన్, కానీ…
- లోపల గుబులు, పైకి గాంభీర్యం.. ఆదినుంచీ పాక్ ఎత్తుగడే ఇదే: భారత్ వైమానిక దాడిపై పాక్ ఇలా…








