26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ ‘కరోనా’ వ్యాక్సిన్.. అన్ని ఏర్పాట్లు పూర్తి

నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ ‘కరోనా’ వ్యాక్సిన్.. అన్ని ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో నేటి నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది జనవరి 16న ప్రారంభం కాగా ప్రస్తుతం చురుగ్గా సాగుతోంది.

ఇప్పటి వరకు కరోనా వారియర్స్ కు, 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు.

అయితే, నేటి నుంచి మాత్రం 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది.

మరోవైపు వ్యాక్సినేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో 45 ఏళ్లు పైబడిన వారు 80 లక్షల మంది ఉన్నారు.

వీరందరికీ వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు  చేసింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన్ వేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు టీకా వేయించుకోబోతున్నారు.

- Advertisement -