25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు దేశంలో మరోమారు కోరలు చాస్తున్న కరోనా.. ఒక్క రోజులోనే 72 వేలకు పైగా కేసులు

దేశంలో మరోమారు కోరలు చాస్తున్న కరోనా.. ఒక్క రోజులోనే 72 వేలకు పైగా కేసులు

- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోమారు కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరణాలు కూడా అంతే స్థాయిలో సంభవిస్తున్నాయి. దీంతో ప్రజల్లో మరోమారు భయాందోళనలు నెలకొన్నాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేడు ప్రకటించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 72,330 కేసులు నమోదయ్యాయి. 459 మంది మరణించారు.

40,382 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. రెండో దశలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. కరోనా కేసుల నమోదుకు సంబంధించి దాదాపు ఆరు నెలల తర్వాత అతి ఎక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని కేంద్రం పేర్కొంది.

గత ఏడాది అక్టోబర్ 10న 74,000 కేసులు నమోదయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ చెలరేగిపోతోంది. కేసుల నమోదులో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్ ఛత్తీస్‌గడ్‌‌లలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

6,51,17,896 మందికి టీకా

తాజా కేసులతో కలుపుకుని దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,22,21,665కు చేరుకుంది. అలాగే, మొత్తం మరణాల సంఖ్య 1,62,927కు చేరుకుంది. 1,14,74,683 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. 5,84,055 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి.

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. నేటి (ఏప్రిల్ 1) నుంచి 45 సంవత్సరాలు పైబడిన అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఇప్పటికి వరకు మొత్తం 6,51,17,896 మందికి టీకా ఇచ్చారు.

 

- Advertisement -