ముచ్చటగా మూడోసారి: ఐరాస మానవహక్కుల మండలి సభ్యత్వం ఎన్నికల్లో భారత్ ఘన విజయం…

Un_LOGO_ani_m
- Advertisement -

united nations

జెనీవా: ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలిలో సభ్య దేశాల ఎంపిక కోసం జరిగిన ఎన్నికలలో భారత్ విజయం సాధించింది. దీంతో 2019 జనవరి 1 నుండి మూడు సంవత్సరల పాటు భారత్ ఐరాస మానవ హక్కుల మండలిలో సభ్య దేశంగా ఉండనుంది. సభ్యత్వం కోసం ఎన్నికల్లో విజయం సాధించేందుకు 97 ఓట్లు అవసరంకాగా ఆసియా పసిఫిక్ కేటగిరీలో బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఫిజీ దేశాలతో పోటీపడి భారత్ 188 ఓట్లతో ఘన విజయన్ని అందుకుంది.

పోటీలో పాల్గొన్న అన్ని దేశాల కంటే భారత్‌కే అత్యధిక ఓట్లు పడ్డాయి. రహస్య ఓటింగ్ పద్ధతిలో ఈ ఎన్నిక జరగ్గా.. మొత్తం 18 దేశాలు ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలిలో సభ్యత్వానికి అవసరమైన ఓట్లు సాధించాయి. 2011-14, 2014-17 మధ్య భారత్ రెండుసార్లు జెనీవా కేంద్రంగా పని చేసే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ఎన్నికైంది.

- Advertisement -