22.7 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ షాకింగ్: అచ్చంపేటలో కుప్పకూలిన కాంగ్రెస్ సభా వేదిక.. రాములమ్మకు తప్పిన ప్రమాదం

షాకింగ్: అచ్చంపేటలో కుప్పకూలిన కాంగ్రెస్ సభా వేదిక.. రాములమ్మకు తప్పిన ప్రమాదం

Vijayashanthi1
- Advertisement -

Vijayashanthi1

మహబూబ్‌నగర్: అచ్చంపేటలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీ నేతలు విజయశాంతి, మల్లు భట్టి విక్రమార్క, నంది ఎల్లయ్య తదితర కాంగ్రెస్ అగ్ర నాయకులకు పెద్ద ప్రమాదం తప్పింది.

శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. వేదికపై పార్టీ మఖ్య నాయకులంతా  కూర్చుని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కార్యకర్తలకు అభివాదం చేస్తున సమయంలో సభా వేదిక ఒక్కసారిగా కుప్ప కులిపోయింది. వెంటనే అప్రమత్తమైన పలువురు మహిళా నేతలు  విజయశాంతిని పైకి లేపారు.

ఈ సంఘటనలో కాంగ్రెస్ నేతలంతా క్షేమంగా బయటపడ్డారు. విజయశాంతితో పాటు పార్టీ నేతలందరిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరు క్షేమంగా ఉండడతో నేతలంతా  ఊపిరి పీల్చుకున్నారు. సభా వేదిక ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం, నేతలంతా ఒక్కసారిగా సభా వేదికపైకి చేరుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -